‘మగువా మగువా’ సాంగ్ లిరిక్స్: స్త్రీ గొప్పతనాన్ని చెప్పే రాంజీ సాహిత్యం

‘మగువా మగువా’ సాంగ్ లిరిక్స్: స్త్రీ గొప్పతనాన్ని చెప్పే రాంజీ సాహిత్యం

‘మగువా మగువా’ సాంగ్ లిరిక్స్: స్త్రీ గొప్పతనాన్ని చెప్పే రాంజీ సాహిత్యం


సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి ఇప్పటికే ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు. రామజోగయ్య శాస్త్రి ఫలానా పాట మాత్రమే రాయగలరు అనడానకి ఎవ్వరూ సరిపోరు. ఎందుకంటే ఆయన కలం నుంచి జాలువారిన పాటల్లో మెలోడీలున్నాయి.. మాస్ మసాలాలున్నాయి.. భక్తిరస గేయాలున్నాయి.. భావోద్వేగత గీతాలున్నాయి. ‘రఘువరన్ బీటెక్’ సినిమాలో రాంజీ రాసిన ‘అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మ’ అనే పాట ప్రతి ఒక్కరితో కంటతడి పెట్టిస్తుంది. మళ్లీ అలాంటి గొప్ప సాహిత్యంతో స్త్రీ ఔన్నత్యాన్ని వివరిస్తూ రాంజీ ‘మగువా మగువా’ అనే పాటను రాశారు.


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తోన్న ‘వకీల్ సాబ్’ సినిమాలోని ఈ ‘మగువా మగువా’ పాటను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం (మార్చి 8న) విడుదల చేశారు. తమన్ స్వరపరిచిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఉమెన్స్ డే రోజు మహిళలకు అంకితం ఇవ్వడానికి ఇది కరెక్ట్ సాంగ్ అనిపిస్తుంది. రాంజీ సాహిత్యం అంత అద్భుతంగా ఉంది. మరి అలాంటి సాహిత్యాన్ని మీరూ పాడేయండి..

పల్లవి

మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా..

మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా..

అటు ఇటు అన్నింటా, నువ్వే జగమంతా

పరుగులు తీస్తావు ఇంటా బయట…

అలుపని రవ్వంత అననే అనవంట…

వెలుగులు పూస్తావు వెళ్లే దారంత…

స.. గ.మ.ప.మ.గ.స… గ.మ.ప.మ.గ.స… గ.మ.ప.మ.గ… గ.మ.ప.మ.గ… గ.మ.ప.గ.స…

మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా..

మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా..

చరణం

నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా…

నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా…

ప్రతి వరసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా అంతులేని నీ శ్రమా అంచనాలకందునా…

ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా నీవులేని జగతిలో దీపమే వెలుగునా…

నీదగు లాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక మగవాడు పసివాడేగా…

ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా…

స.. గ.మ.ప.మ.గ.స… గ.మ.ప.మ.గ.స… గ.మ.ప.మ.గ… గ.మ.ప.మ.గ… గ.మ.ప.మ.గ.స…

మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా…

మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా…

‘వకీల్ సాబ్’ ఫస్ట్ సాంగ్: మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ..

Loading

Source link